AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బుధవారం విచారణ ముగిసింది. ఐదు గంటలు పాటు పోలీసులు వంశీని ప్రశ్నించారు. ఆయన నుంచి రాబట్టిన సమాచారాన్ని పోలీసులు రికార్డుల్లో పొందుపరిచారు. రేపటితో వంశీ మూడు రోజుల కస్టడీ ముగియనుంది. కాగా, ఆయనపై ఇప్పటికే కొత్తగా మరో మూడు కేసులు నమోదు అయ్యాయి.