వరదల్లో గాయపడిన ఏనుగు 'జాయ్‌మతి'కి వంతారా వైద్యం

ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో తీవ్రంగా గాయపడిన 53 ఏళ్ల ఆడ ఏనుగు 'జాయ్‌మతి'కి అత్యవసర వైద్యం అందించేందుకు వంతారా రంగంలోకి దిగింది. నాగాలాండ్‌లోని నామ్‌సాంగ్ ప్రాంతంలో వరద ఉధృతికి కొట్టుకుపోయి, అస్సాంలోని శివసాగర్ జిల్లా బిహుబోర్ వద్ద ఒడ్డుకు చేరిన జాయ్‌మతి నుదురు, చెవులు, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కుడి కన్ను దెబ్బతిని దృష్టి కోల్పోయింది. వయసు పైబడటం, తీవ్ర గాయాల నేపథ్యంలో రోడ్డు మార్గంలో సుదీర్ఘ ప్రయాణం ఏనుగుకు మరింత శ్రమ కలిగిస్తుందని భావించి, గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా ఏనుగుల ఆస్పత్రికి ఎయిర్‌లిఫ్ట్ ద్వారా తరలించాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్

✕
✕