‘వారణాసి’.. మహేశ్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ (వీడియో)

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ టైటిల్ రివీల్ అయింది. ఈ సినిమాకు ‘వారణాసి’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో.. ఈ సినిమా టైటిల్‌తో పాటు మహేశ్ బాబు ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మహేశ్ బాబు త్రిశూలం పట్టుకుని, ఎద్దుపై సవారీ చేస్తూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్