వారణాసి: 3600 మందితో వానరాల దాడి, 200 కోట్లతో కుంభకర్ణ యుద్ధం!

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెల 6 నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్‌లో, 3600 మంది జూనియర్ ఆర్టిస్టులతో 'వానరాల దాడి' సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. VFXతో 50,000 మంది వానరులు లంకపై దాడి చేస్తున్నట్లు చూపించనున్నారు. అనంతరం, 20 నిమిషాల నిడివితో కుంభకర్ణుడితో శ్రీరాముడి మహాయుద్ధాన్ని సుమారు 200 కోట్ల రూపాయలతో తెరకెక్కించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్