ఇంట్లో కత్తితో కూరగాయలు కోస్తుండగా చాలా మంది వారి చేతులు కూడా కట్ చేసుకుంటుంటారు. అన్ని ముక్కలు ఒకే పరిమాణంలో కట్ చేయలేరు. కానీ, కెనడాకు చెందిన చెఫ్ వాలెస్ వాంగ్ మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని టమోటాలను పర్ఫెక్ట్‌గా కోసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. టమాట ముక్కలన్నీ ఒకే సైజులో ఉన్నాయి. ఒక్క నిమిషంలో తొమ్మిది టమోటాలు కోశాడు. అతని నైపుణ్యాన్ని మెచ్చుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అతనిని వరించింది.