నటుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులకు సెప్టెంబర్ 10న బాబు పుట్టాడు. దసరా సందర్భంగా బాబు బారసాల కార్యక్రమాన్ని నిర్వహించారు. వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలతో బాబు పేరును వెల్లడించారు. “ఆంజనేయ స్వామి దయతో పుట్టిన మా బాబుకు ‘వాయువ్ తేజ్ కొణిదెల’ (Vaayuv Tej) అని పేరు పెట్టాం. మీ అందరి దీవెనలు కావాలి” అని పేర్కొన్నారు. వరుణ్, లావణ్య 2023లో ఇటలీలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.