బరువు తగ్గేందుకు ఉపయోగించే ‘వెగోవీ’ ఔషధం.. భారత్‌లోకి ఎంట్రీ

బరువు తగ్గాలనేది చాలా మంది కోరిక. కానీ బరువును తగ్గించుకోలేక చాలా మంది ఒత్తిడికి గురవతారు. అయితే, తాజాగా బరువు తగ్గేందుకు ఉపయోగించే ‘వెగోవీ’ ఔషధాన్ని డెన్మార్క్‌కు చెందిన నోవో నార్డిస్క్‌ సంస్థ భారత్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఔషధాన్ని వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ నెల చివర్లో వెగోవీ మార్కెట్లో అందుబాటులోకి రానుందని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్