600 అడుగుల లోయలో పడిన వాహనం.. ఐదుగురు మృతి

జమ్మూకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలో శనివారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులను తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి 600 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్