బైక్‌ను ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు మృతి

AP: తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేత్తలుతడుకు వద్ద బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు పుత్తూరు మండలానికి చెందిన మణి, శ్రీనివాసులుగా గుర్తించారు. అయ్యప్ప మాల వేసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕