అఖిల్ 'లెనిన్' ట్రైలర్ రేపు విశాఖలో విడుదల

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' చిత్రం ట్రైలర్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నంలోని శరత్ థియేటర్‌లో విడుదల కానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. జూలై 10న విడుదల కానున్న ఈ సినిమాపై అఖిల్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో అఖిల్‌కు భారీ విజయం దక్కుతుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్