'భగవంత్ కేసరి' 71వ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడంపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. తమ ప్రయత్నానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. "నా కెరీర్లో చేసిన విభిన్న ప్రయత్నం 'భగవంత్ కేసరి'. నేను నమ్మినట్టుగానే ఆడియన్స్ దాన్ని ఆదరించారు. ఈ పురస్కారం బోనస్ అని అనుకుంటున్నా. చాలా ఆనందంగా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్‌తోనే 'బనావో బేటీకో షేర్' కాన్సెప్ట్‌ను చెప్పగలిగాం." అని ఆయన తెలిపారు.