ప్రముఖ గాయకుడు పి. జయచంద్రన్ కన్నుమూత

ప్రముఖ గాయకుడు పి. జయచంద్రన్ (80) కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన త్రిస్సూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో 16,000 కంటే ఎక్కువ పాటలు పాడారు. తెలుగులో రోజావే చిన్ని రోజావే (సూర్యవంశం), హ్యాపీ హ్యాపీ బర్త్‌డేలు (సుస్వాగతం), అనగనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి) వంటి హిట్‌ పాటలకు జయచంద్రన్‌ గాత్రం అందించారు.

సంబంధిత పోస్ట్