దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్-1లో సెంట్రల్ జోన్‌పై 4 వికెట్ల తేడాతో ఈస్ట్ జోన్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ ఫైనల్‌కు చేరింది. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో వైభవ్, షమీ, ముకేశ్ తదితర ప్లేయర్లు రాణించి ఈస్ట్ జోన్‌కు విక్టరీని అందించారు. దీంతో రజత్ పాటీదార్ కెప్టెన్సీలోని సెంట్రల్ జోన్‌కు ఓటమి తప్పలేదు. సెంట్రల్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేయగా, ఈస్ట్ జోన్ కూడా 266 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ 158 పరుగులు చేయగా, ఈస్ట్ జోన్ 162/6 పరుగులు చేసి విజయం సాధించింది.