భారత సంతతికి చెందిన ఓమన్ క్రికెటర్ వినాయక్ శుక్లా అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. హాంకాంగ్ ఇంటర్నేషనల్ సూపర్ సిక్సెస్ టోర్నీలో ఇంగ్లండ్‌పై కేవలం 10 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది సంచలనం రేపాడు. ఈ సుడిగాలి ఇన్నింగ్స్‌లో 7 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు బాదిన వినాయక్.. 510 స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు చేశాడు. అతడి ధాటికి ఓమన్ జట్టు 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 159 పరుగులు చేసింది. కాన్పూర్‌లో జన్మించిన వినాయక్, కుల్దీప్ యాదవ్‌కు చిన్ననాటి స్నేహితుడు కాగా, తన ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ.