AP: తీవ్ర వర్షాభావంతో రాయలసీమలోని పలు చెరువుల్లో నీరు లేక గణనాథులను అలాగే నిమజ్జనం చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే గత రెండు రోజులుగా ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదారు నెలలుగా తమ ప్రాంతంలో భారీ వర్షం పడలేదని, వినాయకుల నిమజ్జనం తర్వాత కుండపోత వర్షాలు కురుస్తున్నాయని పలువురు వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో తమ బిడ్డను తీసుకెళ్లేందుకు గంగమ్మే స్వయంగా వచ్చి నిమజ్జనం చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.
Video Credit: BIGTV