గుజరాత్లోని వడోదరా బాజ్వా ప్రాంతంలో షాకింగ్ సంఘటన జరిగింది. చిన్న సైకిల్పై వెళ్తున్న తన కుమారుడితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ తల్లిపై వీధి ఆవు అకస్మాత్తుగా దాడి చేసింది. బాబు కిందపడిపోవడంతో అతనిని కాపాడేందుకు యత్నించిన తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆవును తోలేసి, గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. పశువుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.