శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములు మంగళవారం శబరి ఎక్స్ ప్రెస్ రైల్లో పూజలు చేస్తూ మంగళహారతులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. రైలులో కర్పూరం, అగ్గిపెట్టెలు వంటి మండే వస్తువులను వినియోగించడం నేరమని, ఇది ఊహించని ప్రమాదాలకు దారితీయవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. తోటి ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిబంధనలు పాటించాలని, హారతులు, దీపం లేకుండా పూజలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.