తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఘోర కుల వివక్ష హత్య చోటుచేసుకుంది. గుర్రంతో కూరగాయలు మోసే పనులు చేసే రామార్ (26) అనే దళిత యువకుడి గుర్రం తమ పొలంలో మేసిందనే నెపంతో అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు కొడవళ్లతో నరికి చంపారు. అడ్డువచ్చిన ప్రశాంత్ అనే యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఇది కుల వివక్షతో జరిగిన హత్య అని, నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దళిత, నిరుద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి.