ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ రోడ్డు పక్కన వివస్త్ర మహిళ మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. కాన్పూర్ నుండి అపహరణకు గురైన ఈ మహిళ, అంతకుముందు ఉన్నావ్‌లోని ఒక ఆసుపత్రి యజమానిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. ఆ కక్షతోనే ఆసుపత్రి మేనల్లుడు వివేక్, మహిళను కిడ్నాప్ చేసి, కాల్చి చంపి, మృతదేహాన్ని బులంద్‌షహర్‌లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.