మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో బుధవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక హోటల్ గదిలో మరొక మహిళతో గడుపుతున్న BSF సబ్-ఇన్‌స్పెక్టర్ ఆకాష్ నిరంజన్‌ను అతని భార్య రుచి పటేల్ పోలీసుల సహాయంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. గత ఐదు రోజులుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నట్లు సమాచారం అందడంతో భార్య పోలీసులతో వెళ్లి ఈ వ్యవహారాన్ని రికార్డు చేస్తూ గుట్టురట్టు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.