VIDEO: బైక్‌ను ఢీకొట్టిన బస్సు.. నలుగురు అక్కాచెల్లెళ్లు మృతి!

తమిళనాడులోని నామక్కల్ జిల్లా తిరుచెంగోడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సక్కరంపాళయం జంక్షన్ వద్ద తిరుచెంగోడు ప్రభుత్వ పాఠశాల నుంచి చెల్లెళ్లను తీసుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా, ముత్తయామ్మాళ్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బస్సు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన సవిత (19), నివేద (17), ధనుశ్రీ (13), అభినయ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕