VIDEO: స్విమ్మింగ్ పూల్‌లో పడ్డ చిన్నారిని కాపాడిన కానిస్టేబుల్

మహారాష్ట్రలో ఒక హృదయవిదారక ఘటన సుఖాంతమైంది. ఆడుకుంటూ వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి ఎవరూ లేని సమయంలో ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. గమనించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకి బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సకాలంలో స్పందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన ఆ కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

సంబంధిత పోస్ట్