నవమాసాలూ మోసి.. కని పెంచిన తల్లిని ఓ యువతి దారుణంగా కొట్టింది. కొట్టడమే కాకుండా ఆమెను గట్టిగా కొరుకుతూ.. తల్లిపై కూర్చొని చిత్రహింసలు పెట్టింది. ఈ ఘటన హర్యానాలో జరిగినట్లు తెలుస్తోంది. తనను కొట్టవద్దని ఎంత వేడుకున్నా కూతురు వదల్లేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తల్లి ఫిర్యాదు మేరకు కూతురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.