పంజాబ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కోడలు వృద్ధురాలైన అత్తను అతి కిరాతకంగా కొడుతూ హింసించింది. ఆ వృద్ధురాలు కొట్టవద్దని వేడుకున్నా వదల్లేదు. తల్లిని కొట్టవద్దని కొడుకు భార్యను బ్రతిమిలాడినా కనుకరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.