VIDEO: పాట పాడుతూ గుండెపోటుతో మృతి

ఒడిశాలోని గజపతి జిల్లాలో బుధవారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ బీరేంద్ర కుమార్ దాస్‌ స్టేజిపై జగన్నాథ భజన పాట ఉత్సాహంగా పాడారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా స్టేజిపైనే కుప్పకూలారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కుప్పకూలుతున్న చివరి క్షణాలు వీడియోలో చూడొచ్చు.

సంబంధిత పోస్ట్