యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లా సికందర్‌పూర్ కళా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని గ్రామ ప్రధాన్ కుమారుడు విపిన్ సింగ్, సతీష్ సింగ్ అనే దివ్యాంగుడిపై ఒత్తిడి తెచ్చాడు. సతీష్ అందుకు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన విపిన్, దివ్యాంగుడనే కనికరం లేకుండా అతని చేతిలోని ఊతకర్రలను లాక్కుని వాటితోనే విచక్షణారహితంగా దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.