VIDEO: డ్రైవర్ సమయస్ఫూర్తి చిన్నారి ప్రాణం కాపాడింది!

ఒడిశాలో స్కూల్ వ్యాన్ దిగిన ఓ చిన్నారి అటుగా వస్తున్న మహీంద్రా ట్రక్కును గమనించకుండా రోడ్డు దాటేందుకు పరిగెత్తింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో సెకన్ల వ్యవధిలోనే బ్రేకులు వేయడంతో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోను చూసిన నెటిజన్లు డ్రైవర్ అప్రమత్తతను ప్రశంసిస్తున్నారు. పిల్లలకు రోడ్డు ఎలా దాటాలో తల్లిదండ్రులు తప్పనిసరిగా నేర్పించాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్