VIDEO: గంగానది ఉధృతికి కూలిపోయిన దుర్గామాత ఆలయం!

బీహార్‌లోని భాగల్పూర్ జిల్లా శంకర్పూర్ గ్రామంలో విపత్తు సంభవించింది. గంగానది ఉధృతంగా ప్రవహిస్తూ తీరం తీవ్రంగా కోతకు గురికావడంతో, దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన 'చైతీ మాతా దుర్గాదేవి' ఆలయం నదిలో కొట్టుకుపోయింది. కళ్లెదుటే ఆలయ ప్రాంగణం విరిగిపడి నిమిషాల వ్యవధిలో నదిలో మునిగిపోవడంతో గ్రామీణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్