VIDEO: 169 మంది ఉన్న విమానంలో చెలరేగిన మంటలు

దక్షిణ కొరియాలోని బుసాన్ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి ఓ విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో 169 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్