VIDEO: మాజీ ఎమ్మెల్యే లావూ మామ్లేదార్ మృతి

గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మామ్లేదార్​ (68) శనివారం మృతి చెందారు. ఆయన తాజాగా కర్ణాటకలోని బెలగావిలో పర్యటించారు. ఈ క్రమంలో ఖడేబజార్‌లోని ఓ హోటల్ నుంచి ఆయన బయటకు వస్తుండగా.. కారు ఢీకొందని ఆటోడ్రైవర్ గొడవకు దిగి దాడి చేశాడు. అనంతరం కొద్దిసేపటికే మామ్లేదార్ హోటల్లో కుప్పకూలి చనిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్