యూపీలోని మహోబా జిల్లా మహిళా ఆసుపత్రిలో షాకింగ్ ఘటన జరిగింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళపై అక్కడ ఉన్న ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేశాడు. అయితే, ఆ మహిళ అస్సలు భయపడకుండా అతన్ని కాలర్ పట్టుకుని ఆసుపత్రి బయటకు ఈడ్చుకొచ్చి అందరి ముందే రోడ్డుపై విచక్షణారహితంగా చితక్కొట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.