మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భగవాన్‌దాస్, రాధ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆ చిన్నారులను భగవాన్‌దాస్ చిత్రహింసలకు గురి చేశాడు. వారిని తాళ్లతో కట్టి, తలకిందులుగా వేలాడదీశాడు. తర్వాత దారుణంగా కొట్టాడు. దీంతో పిల్లలను కాపాడాలని తల్లి రాధ పోలీసులను ఆశ్రయించింది. పిల్లలను భగవాన్‌దాస్ కొడుతున్న వీడియో రికార్డ్ చేసి పోలీసులకు ఆమె అందించింది.