VIDEO: భారీ హిమపాతం.. 15కు చేరిన మరణాలు

నేపాల్‌లోని హిమ్లుంగ్ హిమాల్ బేస్ క్యాంప్ వద్ద సంభవించిన భారీ హిమపాతంలో మృతుల సంఖ్య 15కి చేరింది. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. తాజాగా మరో 8 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మానాంగ్ జిల్లాలో 7,126 మీటర్ల ఎత్తైన హిమ్లుంగ్ హిమాల్ పర్వతం ఉంది. విదేశీ పర్వతారోహకులు శిఖరాన్ని అధిరోహించేందుకు కార్మికులు బేస్ క్యాంప్ను సిద్ధం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕