VIDEO: మన దేశంలోనే లేని అరుదైన ఒరాంగుటాన్లు.. ఎలా వచ్చాయి?

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బిచిత్రపూర్‌ అటవీ ప్రాంతంలో అంతర్జాతీయ స్మగ్లర్లు వదిలివెళ్లిన ఐదు అరుదైన ఒరాంగుటాన్‌ జాతి వానరాలను అధికారులు గుర్తించారు. ఇవి ప్రధానంగా ఆగ్నేయాసియా, ఇండోనేషియా, మలేసియా అడవుల్లో కనిపిస్తాయి. బ్లాక్‌ మార్కెట్‌లో ఒక్కో ఒరాంగుటాన్‌ విలువ రూ.20 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని ఒడిశా ప్రభుత్వం వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ బ్యూరోను ఆదేశించింది. వైద్యుల పర్యవేక్షణ అనంతరం వానరాలను భువనేశ్వర్‌ జంతు ప్రదర్శనశాలకు తరలించనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕