ఓ కోతి అరటిపండును మనిషిలా శుభ్రంగా తొక్క తీసి తిన్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పండు పై తొక్కతో పాటు చిన్న చిన్న పొరల్నీ జాగ్రత్తగా తొలగించి పక్కన పడేసింది. అంతే కాక పిల్ల కోతి తలపై పడిన తొక్కలను కూడా తీసి దూరంగా వదిలేసింది. ఈ తెలివైన ప్రవర్తన చూసి నెటిజెన్స్ "మనుషులకంటే నీటుగా కోతి తింటోంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.