గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో విమానాశ్రయ ఆస్తులకు నష్టం వాటిల్లింది, పలువురు గాయపడ్డారు. దీంతో విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, విమానాల రాకపోకలను నిలిపివేశారు. అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. కువైట్, బహ్రెయిన్ ప్రభుత్వాలు తమ ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించాయి.