టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ విద్యాశాఖ సహాయ మంత్రి రివాబా జడేజా యువతతో కలిసి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నాడు జామ్నగర్లోని డీకేవీ కాలేజీలో ‘ఆశీర్వాద్ నో దివ్డో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రివాబా భజన కార్యక్రమంలో పాల్గొని యువతతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.