VIDEO: తిరుపతి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

AP: తిరుపతి జిల్లా చిట్వేలి - రాపూరు ఘాట్ రోడ్డులో తరచుగా చిరుతపులులు సంచరిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ప్రధాన రహదారిపైకి వచ్చి సంచరిస్తున్న దృశ్యాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు స్పందిస్తూ.. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం ప్రమాదకరమని, ఒంటరిగా వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప రాత్రి ప్రయాణాలు చేయవద్దని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕