VIDEO: బైకును ఢీకొట్టిన లారీ.. వ్యక్తి స్పాట్‌డెడ్

AP: పామర్రు ప్రధాన కూడలిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 56 ఏళ్ల హెయిర్ స్టైల్ యజమాని అనిల్ మరణించారు. మోటార్ సైకిల్ పై వెళ్తుండగా మినీ లారీ ఢీకొనడంతో లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తర్వాత లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్