AP: పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ (M) బాసురు గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఓ పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. పెళ్లి వేడుక ఊరేగింపులో స్నేహితులతో డ్యాన్స్ చేస్తూ బంగారు నాయుడు అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.