AP: కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ముఖం చాటేయడంతో బాధితురాలు న్యాయం కోసం ఆందోళనకు దిగింది. ఆగస్టు 30న విజయవాడ దుర్గగుడిలో ఫణికుమార్ ను వివాహం చేసుకున్న జయలక్ష్మి, కొద్దిరోజుల తర్వాత భర్త ఇంటికి రాకపోవడంతో మోసపోయానని గుర్తించి, అత్తింటి ఎదుట నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.