VIDEO: 300 సినిమాల షూటింగ్‌ జరిగిన చెట్టు కూలిపోయింది!

సినిమా చెట్టు కూలిపోయింది. 1975లో రిలీజైన పాడిపంటలు సినిమా నుంచి రంగస్థలం వరకు ఆ చెట్టు ఓ ఐకాన్ సింబల్. మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు.. ఇలా అనేక సినిమాల్లో ఆ చెట్టు కనిపించింది. దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ గా ఉండేది.150 సం.ల వయస్సున్న ఈ చెట్టు చుట్టూ దాదాపు 300 సినిమాల షూటింగ్‌లు జరగడం విశేషం. తూ.గో జిల్లా కొవ్వూరు(M) కుమారదేవంలో ఈ చెట్టు ఉంది.

సంబంధిత పోస్ట్