గుజరాత్ సూరత్‌లోని పాల్ ప్రాంతంలో బాణసంచా కాల్చే విషయంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తిస్తూ తమపై దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ పరస్పర దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.