హైదరాబాద్ గచ్చిబౌలిలో రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. మనకు తెలుగు అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ లాంటిదని చెప్పుకొచ్చాడు. అయితే, ఒకప్పుడు "హిందీ గో బ్యాక్" అన్న ఆయన ఇప్పుడు బీజేపీ పెద్దల కోసం హిందీ రాగం అందుకున్నాడని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.