భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వేళ పాకిస్తాన్ ఇండియాపై గురువారం రాత్రి ప్రతీకార దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ భారత్‌పై భారీ దాడికి యత్నించినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. 400 డ్రోన్లతో సియాచిన్ నుంచి కచ్ వరకు 36 ప్రాంతాల టార్గెట్ చేసుకుని డ్రోన్లను వదలడంతో వాటిని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నాయి. ఈ డ్రోన్లకు కెమెరాలను పెట్టారని, ఇక్కడి సమాచారాన్ని సేకరించేలా పాక్ కుట్ర పన్నినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.