AP: నూతన సంవత్సరం వేళ పిఠాపురం ఇంద్రానగర్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. పంట కాలువలో గుర్రపు డెక్కా, ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోవడంతో కాలనీలోకి నీరు చేరింది. పలు ఇళ్ళల్లోకి ముంపు నీరు రావడంతో పాములు, కీటకాలతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పరిస్థితిపై ముంపు బాధితులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.