సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం కోసం ఓ యువకుడు కొండపైన ప్రమాదకరంగా రీల్స్ చేశాడు. ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి బ్యాక్ఫ్లిప్లను ప్రాక్టీస్ చేశాడు. అలా చేస్తుండగా అతని స్నేహితుడు వీడియో తీశాడు. అయితే బ్యాక్ఫ్లిప్ చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు కొండపై నుంచి కిందకు పడిపోయాడు. యువకుడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ వైరల్ అవుతోంది.