హర్యానా రాష్ట్రాన్ని భారీ వర్షం ముంచెత్తింది. గురుగ్రామ్‌లో కేవలం 12 గంటలలో 133 మి.మీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ వర్షం కారణంగా పెరిఫెరల్ రోడ్డులో ఓ చోట రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. బుధవారం రాత్రి అటుగా వెళ్తున్న ఓ ట్రక్కు గుంతలో ఇరుక్కుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.