తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో మంజీరా నదిలో ఇసుక తవ్వకాల విషయంలో ఉద్రిక్తత నెలకొంది. మహారాష్ట్రలోని బోలేగావ్ కు చెందిన ఇసుక వాహనాలను తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తూ బోధన్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.