AP: పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం లంకెల కూరపాడులో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అన్నయ్య సిద్ధార్థ్ను బస్సు ఎక్కించే క్రమంలో తల్లితో పాటు వచ్చిన మూడేళ్ల బాలుడు నితిన్ను ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాలుడు నితిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.